‘అప్నీ హద్ సే’ సాంగ్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే

by Sujitha Rachapalli |

మహమ్మద్ నజీర్, రిఫత్ రజూర్ జంటగా నటించిన మెలోడియస్ మ్యూజిక్ వీడియో ప్రసాద్ ల్యాబ్స్‌లో ‘అప్నీ హద్ సే’ సాంగ్ లాంచ్.. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

‘అప్నీ హద్ సే’ సాంగ్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే
X

దిశ, సినిమా : మహమ్మద్ నజీర్, రిఫత్ రజూర్ జంటగా నటించిన మెలోడియస్ మ్యూజిక్ వీడియో ‘అప్నీ హద్ సే’ (Apni Haddse) హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా విడుదలైంది. ఈ వేడుకకు జుబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, సాంగ్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువ ప్రతిభను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని, సౌత్ లో హిందీ సినిమా చేయటం చాలా మంచి పరిణామం ఈ సినిమా మరియు వీడియో సాంగ్ మంచి విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మ్యూజిక్ వీడియోలో మహమ్మద్ నజీర్ హీరోగా నటించగా, రిఫత్ రజూర్ హీరోయిన్‌గా మెరిశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, 'ప్రియతమా' (మజిలీ) వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అభయ్ జోధ్‌పుర్కర్ తన గాత్రంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. అత్యున్నత నిర్మాణ విలువల‌తో, కళ్లకు రిచ్‌గా అనిపించే విజువల్స్‌తో ఈ వీడియో సాంగ్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహమ్మద్ నజీర్ .. "మా ‘అప్నీ హద్ సే’ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు అతిథులకు ధన్యవాదాలు. అభయ్ జోధ్‌పుర్కర్ వంటి గొప్ప సింగర్ మా పాట పాడటం మాకు గర్వకారణం. ప్రేక్షకులకు ఈ పాట కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను," అని తెలిపారు.

Next Story