అనుష్క ‘ఘాటి’ ట్రైలర్‌... ఇక ఫ్యాన్స్ కు జాతరే

by velandi.Saikiran |   (  Updated:2025-08-15 17:12:50  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి తెలియని వారు ఉండరు. సూపర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ

అనుష్క ‘ఘాటి’ ట్రైలర్‌... ఇక ఫ్యాన్స్ కు జాతరే
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి తెలియని వారు ఉండరు. సూపర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ అందాల తార ఇండస్ట్రీని ఇప్పటికి కూడా దున్నేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మరింత పాపులర్ అయిన అనుష్క శెట్టి... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా... త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించనుండగా.. రాజీవ్ రెడ్డి అలాగే సాయిబాబా నిర్మాతలుగా ఉన్నారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.

ఇక ఘాటి ట్రైలర్ విషయానికి వస్తే... ఇందులో అనుష్క, విక్రం ప్రభు మధ్య రొమాంటిక్ సీన్స్ తో పాటు.. అందరినీ ఆకట్టుకునేలా ఫైటింగ్, ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. గంజాయి చుట్టూ ఈ సినిమా కథ నడిచేలా కనిపిస్తోంది. చివరలో సినిమా మొత్తం అనుష్కనే నడిపించేలా విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రౌడీలను చితక బాదడం... అడ్డు వచ్చిన వాళ్ళను నరకడం లాంటి సీన్లలో అనుష్క రెచ్చిపోయారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మరోసారి అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

Next Story