హైదరాబాద్ బోనాల పండుగకు టాలీవుడ్ భామ

by velandi.Saikiran |   (  Updated:2025-07-17 07:39:44  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి తెలియని వారు ఉండరు. దాదాపు పది

హైదరాబాద్ బోనాల పండుగకు టాలీవుడ్ భామ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి తెలియని వారు ఉండరు. దాదాపు పది సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో.. కొనసాగుతున్న ఈ బ్యూటీ...అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ సినిమాతో పాటు.. ప్రేమమ్ సినిమాలో కూడా ఈ అందాల తార మెరిసింది. కానీ శతమానం భవతి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో... మంచి పేరు సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్.

ఆ తర్వాత ఇండస్ట్రీలో వెనక్కి చూసుకోలేదు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, అంటే సుందరానికి, కార్తికేయ2 లాంటి మంచి సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. ఇక ఈ హీరోయిన్ తాజాగా చేసిన సినిమా పరదా. ఇది ఇలా ఉండగా... ప్రస్తుతం హైదరాబాదులో బోనాల పండుగ హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజులపాటు మాత్రమే ఈ పండుగ జరగనుంది.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బోనాల పండుగలో పాల్గొన్నారు హీరోయిన్ అనుపమ. బల్కంపేట ఎల్లమ్మ వారి ఆలయంలో.. అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ పరదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే.. బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు అనుపమ. ఈ సందర్భంగా అనుపమకు.. ఆలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానం పలికింది.

TWITTER lINK

Next Story