‘నాపై అపారమైన ప్రేమ కురిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’.. అనుపమ పరమేశ్వరన్

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘నాపై అపారమైన ప్రేమ కురిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’.. అనుపమ పరమేశ్వరన్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తమిళ సినిమా కోడి (Koḍi) చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనుపమ 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి (Shatamanam Bhavati) చిత్రంలో శర్వానంద్‌తో జంటగా నటించి.. తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటించిన మొట్టమొదటి మూవీ మలయాళంలో ప్రేమమ్ (Prēmam)ఒకటి.

తర్వాత అనుమప జోమోంటే సువిశేషంగల్ (Jomonte Suviseshangal), ఆఆ (AaAa), నటసార్వభౌమ (Natasaravabhauma), ఉన్నది ఒక్కటే జిందగీ (Unnadi okkaṭe jindagi), కార్తికేయ 2,, టిల్లు స్వ్కేర్ (Tillu Square), వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఉత్తమ నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ భామ కేవలం తెలుగు భాషలోనే కాకుండా.. మలయాళ, తమిళ చిత్రాల్లో కూడా నటించి జనాల మెప్పు పొందింది.

ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ అటు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే కనిపిస్తుంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. డిఫరెంట్ ఢిఫరెంట్ ఫొటో షూట్లతో ఈ ముద్దుగుమ్మ అందరినీ ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ లుక్ లో కనిపించి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటుంది.

తాజాగా అనుపమ తాజాగా సోషల్ మీడియా వేదికన అయిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘కీర్తి.. నాపై అపారమైన ప్రేమ కురిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ అనుపమ పరమేశ్వరన్ తన పోస్ట్‌కు ఓ క్యాప్షన్ కూడా జోడించింది. అలాగే చీరలో పద్ధతిగా మెరిసిపోతున్న ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ క్యూటీ సంప్రదాయ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Next Story