- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సినిమా ప్రకటించిన అనుపమ్ ఖేర్.. ఇందులో భాగం కావడం గౌరవంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
రామ్‌భూమి నా 552వ సినిమా. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తున్నందుకు నేను ఎంతో సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నాను.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనుపమ్ ఖేర్ 71 ఏళ్లు వచ్చినప్పటికీ నిత్యం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ సరికొత్త కథలను తీసుకొస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నటుడిగా, దర్శకుడిగా రాణిస్తూ.. యంగ్ స్టర్స్‌కు గట్టి పోటీనిస్తున్నారు. ఇక ఇటీవల ‘తన్విది గ్రేట్’ మూవీతో ప్రేక్షకులను అలరించిన అనుపమ్ ఖేర్.. తాజాగా, తన 552వ ప్రాజెక్ట్ ప్రకటించారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా సెట్ నుండి ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన తెల్లటి చొక్కా, బ్లూ జీన్స్ వేసుకుని, చేతిలో ‘రామ్ భూమి’ అని రాసి ఉన్న క్లాప్‌బోర్డ్ పట్టుకుని ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఆ ఫోటోతో పాటు అనుపమ్ ఖేర్ ఓ ఎమోషనల్ నోట్ కూడా రాశారు. "రామ్‌భూమి నా 552వ సినిమా. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తున్నందుకు నేను ఎంతో సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నాను.
ప్రతి దశాబ్దంలో లేదా ప్రతి శతాబ్దంలో.. ప్రపంచానికి ఖచ్చితంగా చెప్పాల్సిన ఒక కథ వస్తుంది. ఇది అలాంటి నిజాయితీ గల కథ. నమ్మకం, ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణం" అని పేర్కొన్నారు. అలాగే.. "ఈ ప్రయాణంలో నేను కూడా ఒక భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, శుభాకాంక్షలు కావాలి. జై శ్రీరామ్" అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో అనుపమ్ ఖేర్‌తో పాటు రిత్విక్ భోమిక్, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘శ్రీ రామ్ భూమి’ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. అనుయా చౌహాన్ కుడేచా, రితేష్ కుడేచా, ఉమేష్ కుమార్ బన్సల్, గిరీష్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ, విడుదల తేదీకి సంబంధించిన మిగతా వివరాలను చిత్ర బృందం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచింది.






