- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sunil : తమిళ ఇండస్ట్రీలోకి మరో టాలీవుడ్ నటుడు.. అఫీషియల్ పోస్టర్ వైరల్
యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తమిళ రంగంలోకి ఎంట్రీ ఇస్తు్న్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తమిళ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హై-ఎనర్జీ, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ‘గోలిసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా రాబోతుంది. ఈ మూవీలో రాజ్ తరుణ్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రను పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది. టాలీవుడ్‌లో హాస్య నటుడుగా, హీరో, విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సునీల్.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాడు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘రాజ్ తరుణ్ అండ్ విజయ్ మిల్టన్ ప్రాజెక్టులో నటుడు సునీల్ భాగం అయ్యారు. ఈ సినిమా టైటిల్‌ను జూన్ 15న ప్రకటిస్తాము’ అంటూ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో డైరెక్టర్ విజయ్ మిల్టన్ అండ్ సునీల్ దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు.
Actor #Sunil on board for #RajTarunXVijayMilton
— Vamsi Kaka (@vamsikaka) June 8, 2025
TITLE ANNOUNCEMENT On June 15th! pic.twitter.com/wjUnHmnKLz






