Adi Saikumar: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి మరో కొత్త క్యారెక్టర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-05-27 10:53:01  IST  )

యంగ్ హీరో ఆది సాయికుమార్ (Adi Saikumar) నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’

Adi Saikumar: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి మరో కొత్త క్యారెక్టర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: యంగ్ హీరో ఆది సాయికుమార్ (Adi Saikumar) నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్ (Fantasy thriller) చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambala). యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డిలు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించ్చాయి. ఇందులో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే వీళ్ల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా మరో కొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేసింది. ఇందులో నటుడు శివకార్తీక్ ‘బాలుగా’ నటిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక ఈ పోస్టర్ గమనించినట్లయితే.. బాలు కారెక్టర్ వింత చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, పోస్టర్‌లో ఉన్న ఆ దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఆది ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. వేల ఏళ్ల వెనక్కి ఆడియెన్స్‌ను తీసుకెళ్లేలా ఈ ‘శంబాల’ ఉంటుంది. పురాణాలు, పురాతన చరిత్ర, అతీంద్రియ అంశాలను ఇందులో చూపించబోతోన్నారు. అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Next Story