బ్రహ్మానందంకు మరో జీవితకాల పురస్కారం.. ఆనందం లేని జీవితం వ్యర్థం

by Naga Rani Yarlagadda |

డబ్బు ఎంత ఉన్నా.. ఆనందంలేని మనిషి జీవితం వ్యర్థమని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం తెలిపారు.

బ్రహ్మానందంకు మరో జీవితకాల పురస్కారం.. ఆనందం లేని జీవితం వ్యర్థం
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్బు ఎంత ఉన్నా.. ఆనందంలేని మనిషి జీవితం వ్యర్థమని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం తెలిపారు. అందరికీ ఆనందాన్ని పంచే సత్తా.. అందరి ముఖాల్లో నవ్వులు పూయించే టాలెంట్, ముఖాన్ని దేవుడు తనకు ఇచ్చాడని, జీవితంలో ఇంతకటే కావాల్సింది ఏముంటుందని వ్యాఖ్యానించారు. ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బొల్లిముంత శివరామకృష్ణ జాతీయస్థాయి జీవితకాల పురస్కారాన్ని ఆయన అందుకు్నారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్, రాష్ట్ర సృజనాత్మకత- సంస్కృతి సమితి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. దేవుడు ఎన్ని జన్మలు ఇస్తే.. అన్ని జన్మలూ తాను ఇతరులకు ఆనందాన్ని పంచే జన్మ ఇవ్వాలని కోరుకుంటానన్నారు. ఇక తెనాలి పట్టణంతో తనకెంతో అనుబంధం ఉందన్నారు. తన సోదరి అనసూయమ్మ తెనాలి JMJ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేశారని, ఆ సమయంలో తాను తెనాలికి వచ్చి కూరగాయలు ఇచ్చి వెళ్లేవాడినని గుర్తుచేసుకున్నారు. ఇక్కడ వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో డిసెంబర్ 14న తన వివాహం జరిగిందన్నారు.

Next Story