- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనీల్ రావిపూడీ క్రేజ్.. షూటింగ్ స్టార్ట్ కాకముందే మల్టీస్టారర్ ఓటీటీ డీల్ క్లోజ్
అనీల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం.

దిశ, సినిమా: ఇటీవల ‘మన శంకర్ వరప్రసాద్’ చిత్రంతో సంక్రాంతి స్పెషల్‌గా వచ్చి తన మార్క్ మరోసారి ఫ్రూవ్ చేసుకున్న డైరెక్టర్ అనీల్ రావిపూడి.. ఇప్పుడు భారీ మల్టీ స్టారర్ కథను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇప్పటికే కృతి శెట్టి ఫిక్స్ కాగా.. కీర్తి సురేష్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే.. అప్పుడే ఓటీటీ డీల్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అనౌన్స్‌మెంట్ నుంచే ఈ క్రేజీ మల్టీ స్టారర్‌పై ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. దీంతో షూటింగ్ మొదలవ్వకముందే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ డీల్ కోసం పోటీ పడినట్లు టాక్. దీంతో ఎక్కువ మొత్తంలో ZEE5 ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ సినిమా పూజ కూడా కాకముందే కోట్ల బిజినెస్ అంటే.. ఇది అనిల్ రావిపూడి బ్రాండ్ పవర్ అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్లు. కాగా.. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి టార్గెట్‌గా చేసుకుని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాడు మన డైరెక్టర్.






