Venky Atluri : సూర్య-46లో బాలీవుడ్ స్టార్ నటుడు.. ఫైనల్లీ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ సూర్య (Surya), టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరీ (Venky Atluri) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Venky Atluri : సూర్య-46లో బాలీవుడ్ స్టార్ నటుడు.. ఫైనల్లీ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య (Surya), టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరీ (Venky Atluri) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సూర్య-46 (Surya-46) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బైజు హీరోయిన్ కాగా.. రవీనా టాండన్, రాధిక అప్టే కీలక పాత్రత్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ ఓ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తుల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వెంకీ అట్లూరీ.

‘అనిల్ కపూర్‌(Anil Kapoor)ను మేము ఎప్పుడు కలవలేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడింది లేదు. అయితే.. ఎక్కడ క్రియేట్ చేయబడ్డాయో తెలియదు కానీ, ఆయన సూర్య-46లో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి రూమర్స్ నమ్మకండి. మా సినిమాకు సంబంధించిన ఓ ఒక్క అంశాన్ని అయినా మేము అధికారికంగా ప్రకటిస్తాము.. మా అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తలను మాత్రమే నమ్మండని తెలియజేస్తు్న్నాము’ అని తెలిపారు. ఇక డైరెక్టక్ వెంకీ స్పందించడంతో.. ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లు అయింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కాబెతున్నట్లు సమాచారం.

Next Story