Nuvvnte Chale: ట్రెండింగ్ వన్‌లో రామ్ సాంగ్.. పోస్ట్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2025-07-24 15:38:29  IST  )

హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పి. మహేష్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.

Nuvvnte Chale: ట్రెండింగ్ వన్‌లో రామ్ సాంగ్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పి. మహేష్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ ‘నువ్వుంటే చాలే’ రిలీజ్ చేశారు మేకర్స్.

రామ్ పోతినేని రాసిన ఈ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. వివేక్, మెర్విన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంతో పాటు.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ వన్‌లో నిలిచింది. దీంతో.. తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ మేరకు 5 రోజుల నుండి ఆంధ్ర కింగ్ తాలుకా ‘నువ్వుంటే చాలే’ సాంగ్ YouTubeలో ట్రెండింగ్ #1 దూసుకుపోతోంది అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story