- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విష్ణు ప్రియకు కలిసొచ్చిన కేసు.. సబ్‌స్క్రిప్షన్ ద్వారా లక్షల్లో పెరిగిన రాబడి.. షాక్‌లో నెటిజన్లు
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాంకర్ విష్ణు ప్రియ పేరు హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియాలో యాంకర్ విష్ణు ప్రియ పేరు హాట్ టాపిక్‌గా మారింది. సబ్‌స్క్రిప్షన్ పేరుతో లక్షల్లో డబ్బులు సంపాదిస్తుందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోల ఇష్యూ ప్రజెంట్ టాలీవుడ్‌లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ కేసు నమోదు కాకముందు విష్ణుకి 1892 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండేవారు. దీంతో నెలకు రూ. 399 చెప్పునా దాదాపు రూ. 7 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఇక కేసు తర్వాత సోషల్ మీడియాలో ఈ విషయం మరింత రచ్చ కావడంతో అసలు అందులో ఎలాంటి కంటెంట్ ఉంది, ఎందుకింత వైరల్ అవుతుంది అనుకున్నారో ఏమో ఇప్పుడు సబ్‌స్క్రైబర్ల సంఖ్య 4,832కు దగ్గరకు చేరింది. అంటే దగ్గరదగ్గరగా ఆమె నెల ఆదాయం ఇప్పుడు రూ. 18 లక్షలకు చేరింది. దీంతో నోరు ఎల్లబెడుతున్నారు నెటిజన్లు. ఇంత నెగిటివిటి కూడా క్యాష్ చేసుకుంది అంటే మామూలుగా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఏదైతేనే కేసు పెట్టిన వాళ్ల కంటే విష్ణుకే బాగా యూజ్ అయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






