బిడ్డకు జన్మనిచ్చిన యాంక‌ర్ శివ‌జ్యోతి !

by velandi.Saikiran |

యాంకర్ శివ జ్యోతి దంపతులు త‌ల్లిదండ్రులు అయ్యారు. ఈ జంట‌కు ఫిబ్రవరి 12వ తేదీన పండంటి బిడ్డ పుట్టింది. అయితే, జెండర్ మాత్రం సావిత్రి చెప్ప‌లేదు.

బిడ్డకు జన్మనిచ్చిన యాంక‌ర్ శివ‌జ్యోతి !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తీన్మార్ వార్తలతో యాంకర్ శివ జ్యోతి ( Anchor Shiva Jyothi ) మాత్రం బాగా పాపులర్ అయ్యారు. తెలంగాణ యాస, భాష అద్భుతంగా మాట్లాడగలిగే సత్తా శివ జ్యోతికి ( Anchor Shiva Jyothi ) ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయిన శివ జ్యోతి, సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. అయితే అలాంటి యాంకర్ శివజ్యోతి తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

త‌ల్లిదండ్రులు అయిన యాంకర్ శివ జ్యోతి దంపతులు

యాంకర్ శివ జ్యోతి ( Anchor Shiva Jyothi ) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 12వ తేదీన పండంటి బిడ్డకు యాంకర్ శివ జ్యోతి జన్మనిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో యాంకర్ శివజ్యోతి, గంగూలీ పోస్ట్ పెట్టారు. అయితే ఈ జంటకు జన్మించింది అమ్మాయా? లేదా అబ్బాయా? అనే విషయాన్ని పేర్కొనలేదు. త‌మ‌కు పుట్టిన బిడ్డ జెండ‌ర్ ను త్వరలోనే రివీల్ చేస్తానని సోషల్ మీడియాలో శివ జ్యోతి పోస్ట్ పెట్టారు. ఫిబ్రవరి 12వ తేదీన తమ ఇంటికి మూడవ వ్యక్తి వచ్చారని ఎమోషనల్ అయ్యారు శివ జ్యోతి. దీంతో శివ జ్యోతి దంపతులు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story