- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ యాంకర్ స్ట్రాంగ్ వార్నింగ్.. చెప్పు తెగుద్ది అంటూ !
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది యాంకర్ గా మాత్రమే కాకుండా

దిశ, వెబ్ డెస్క్: యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా అనసూయ సమయం దొరికినప్పుడల్లా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లాంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటూ భారీగా డబ్బులను సంపాదిస్తోంది. సోషల్ మీడియాలో అనసూయకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా అనసూయ వ్యవహరిస్తుంది. అంతేకాకుండా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కూడా ఉంటుంది. అనసూయకు సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతుంది కొన్ని మాటలకు మాత్రం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ కొందరు పోకిరిలకు చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా కొంతమంది యువకులు అసభ్యకరంగా మాట్లాడడంతో అనసూయ ఫైర్ అయ్యారు. చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మ, చెల్లి, ప్రియురాలు, మీ కాబోయే భార్యను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా. పెద్దవారిని ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వారు నేర్పించలేదా అంటూ అనసూయ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అనసూయ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.






