- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Champion: రోషన్ ‘చాంపియన్’ మూవీలో యంగ్ బ్యూటీ ఫిక్స్.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

దిశ, సినిమా: హీరో శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్ (Roshan). నిర్మలా కాన్వెంట్, పెళ్లింసందDతో హిట్ అందకున్న ఈ యంగ్ హీరో.. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘చాంపియన్’ (Champion) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. స్పోర్ట్స్ (ఫుడ్‌బాల్) బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీని స్పప్న సినిమాస్, జీ స్డూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan)ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తాజాగా అనస్వర బర్త్‌డే కావడంతో.. ఆ సందర్భంగా చాంపియన్‌లో ఈ హీరోయిన్ పాత్రను రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. చాంపియన్‌లో అనస్వర చంద్రకలగా కనిపిస్తున్నట్లు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో క్యూట్ అండ్ ఇన్నోసెంట్ లుక్‌తో ఆకట్టుకుంటుంది ఈ మలయాళ బ్యూటీ. లింక్






