ఎమోషనల్ వీడియో షేర్ చేసిన అనసూయ.. చాలా స్పెషల్ అంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |

జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎమోషనల్ వీడియో షేర్ చేసిన అనసూయ.. చాలా స్పెషల్ అంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ కూడా పోషించింది.

ఇదిలా ఉంటే.. ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేసిన అనసూయ.. తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తన కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను నిర్వహించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ‘నా పెద్ద కొడుకు ప్రియమైన శౌర్య భరద్వాజ్.. నీకు ఈ వేడుక అవసరం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు.

కానీ ఈరోజు నీ ఉపనయనం వేడుకతో నీ అమ్మానాన్నలుగా, కుటుంబంగా మేమంతా కలిసి ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగుపెట్టామని పిస్తోంది. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు, జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించేలా.. మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేలా వాగ్దానాన్ని తీసుకున్నాం. నువ్వు మన సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. ఆ హనుమాన్ జీ శక్తి నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపిస్తుంది’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story