- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో దేశపు సంస్కృతిని, వంటకాల్ని ఆస్వాదిస్తూ ఏనుగులతో ఆడుకుంటోన్న అనసూయ ఫ్యామిలీ.. నెట్టింట వైరలవుతోన్న వీడియోలు
హాట్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ సమయం దొరికినప్పుడల్లా.. భర్త పిల్లలతో కలిసి వెకేషన్స్‌కు చెక్కేస్తుంది. అక్కడ సరదాగా గడిపిన ఆనందాలన్నీ సోషల్ మీడియాలోని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా అనసూయ ఫ్యామిలీ శ్రీలంకలోని కాండీ, పిన్నవాలా టెంపుల్ ఆఫ్ టూత్ రెలిక్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్‌తో పంచుకుంది.
అక్కడ భర్త, పిల్లలతో విమానంలో వెళ్లోన్న ఫొటోలు, అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తోన్న వీడియోలు పంచుకుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద ఏనుగులకు ఆహారం పెడుతోన్న వీడియోలు మరింత హైలెట్‌గా నిలిచాయి. ఈ పోస్టుకు హాట్ బ్యూటీ అనసూయ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘మరో దేశాన్ని.. మరో సంస్కృతిని.. మరో వంటకాలను .. మరో జీవనశైలిని అన్వేషిస్తున్నాం’’ అని వ్యాఖ్యలు జోడించింది.
ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే... హాట్ యాంకర్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ... తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ నటి బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు.






