నేను వాళ్లతో అలా చేయడం మా ఆయనకు నచ్చదు.. చాలా ఇబ్బంది పడతారు.. అనసూయ బోల్డ్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-07-30 05:25:39  IST  )

జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నేను వాళ్లతో అలా చేయడం మా ఆయనకు నచ్చదు.. చాలా ఇబ్బంది పడతారు.. అనసూయ బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ కూడా పోషించింది. అలాగే మరోసారి సుకుమార్ దర్శకత్వంలో బన్నీ(Allu Arjun) హీరోగా వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీలో సునీల్(Sunil) భార్య దాక్షాయణిగా నటించి మెప్పించింది.

తన నటనతో అందరికీ షాక్‌కు గురిచేసింది. ఇక రీసెంట్‌గా ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)లో కూడా నటించి అలరించింది. అలా ఓ పక్కా సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొజులతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. అయితే కొన్ని కొన్ని సార్లు తన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ట్రోలింగ్‌కి కూడా గురైయింది. అయినప్పటికీ వారికి గట్టి కౌంటర్ ఇస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా ఆయన ప‌ర్‌ఫెక్ట్ అని అంద‌రు అనుకుంటారు. కాని ఆయ‌న‌ కూడా అందరి మగాళ్లలాగే . మా ఇద్దరి మధ్య కూడా కొన్ని సంద‌ర్భాల‌లో గొడవలు అయ్యాయి.

నేను వెళ్లి కొంతమందిని కలవడం. కొంతమందితో సినిమాలు చేయడం ఆయనకు నచ్చలేదు. ఆ స‌మ‌యంలో చాలా ఇబ్బందులు ప‌డుతూ గొడ‌వలు ప‌డ్డ సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. నేను హీరోలతో.. పెద్ద పెద్ద స్టార్‌లతో.. గుడ్ లుకింగ్ పీపుల్స్‌తో ఇంట్రాక్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది ప‌డేవారు. అబ్బాయిల మనస్తత్వమే అది. నన్ను ఫ్లర్ట్ చేయడం కావచ్చు.. కాంప్లిమెంట్ కావచ్చు.. ఆయన తీసుకోలేరు. సాధార‌ణంగా అంద‌రు కూడా అన‌సూయ భ‌ర్త అన్నీ చేయ‌నిస్తాడు, అన్నింటికి ఒప్పుకుంటాడు అని అంద‌రు అనుకోవ‌చ్చు. వాడు చేత‌కాని వాడు అని కూడా అంటారు. అదృష్టం ఏంటంటే మా ఆయ‌న‌కి తెలుగు రాదు. సోష‌ల్ మీడియాలో కామెంట్స్ ప‌ట్టించుకోడు. ఆయ‌న‌లా ఉండాల‌ని ఎన్నోసార్లు అనుకుంటాను.

నేను మా ఆయనతో ఉన్నట్టు వేరే వాళ్లతో ఉండలేను. నాకు వేరే వ్యక్తి బ్యాడ్‌గా అనిపిస్తే.. నేను అతనికి బ్యాడ్‌గా కనిపిస్తా. అది హ్యూమన్ బిహేవియర్ అంతే. నేను కూడా మా ఆయనతో ఇన్‌సెక్యురీగా ఫీల్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. అనసూయకి అసూయ అనేది వాళ్ల ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడా ఉండదు. నేను మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్‌ని. ఆయన కూడా అలాగే ఫీల్ అవుతారు. ఇక మన అన్నతో మనకి విడాకులు ఉండవు.

అమ్మతో విడాకులు ఉండవు.. అక్కతో ఉండవు. కానీ కేవ‌లం భార్యతోనే ఉంటుంది. పెళ్లి అనే దానికి మన భారతీయ సాంప్రదాయంలో ఇచ్చేటంత గౌరవం మ‌రెక్క‌డ కూడా ఇవ్వ‌రు. అయితే ఈ మ‌ధ్య విడాకుల వ‌ల‌న విలువ‌లు త‌గ్గించుకుంటున్నారు. ఓపిక‌,అడ్జెస్ట్‌మెంట్ వ‌ల్ల‌నే బంధాలు నిల‌బ‌డ‌తాయి. ఈ జ‌న‌రేష‌న్ వారికి అంత ఓపిక లేదు’ అని అన‌సూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read..

అలాంటి స్త్రీలే కావాలంటున్న పురుషులు.. ఆ విషయంలో Expectations ఎలా ఉన్నాయంటే..

Next Story