ananya.nagalla: ‘గత 5 సంవత్సరాలు హిట్- ఫ్లాప్‌తో సంబంధం లేకుండా నా హృదయాన్ని అనుసరించాను’

by Kodari Anjali |

హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

ananya.nagalla: ‘గత 5 సంవత్సరాలు హిట్- ఫ్లాప్‌తో సంబంధం లేకుండా నా హృదయాన్ని అనుసరించాను’
X

instagram linkదిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అనన్య తర్వాత ప్లే బ్యాక్ అనే చిత్రంతో భారీ విజయం అందుకుంది. అనంతరం పవర్ స్టర్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అవకాశం కొట్టేసి.. ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తంత్ర అనే మూవీలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేసి జనాల్ని మెప్పించింది. తర్వాత పొట్టేల్ మూవీలో అవకాశం కొట్టేసింది.

వీటితో పాటు ఈ బ్యూటీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బహిష్కరణ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించి.. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ గద్దర్ అవార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. అవార్డు అందుకున్న సందర్భంగా ఈ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘గత 5 సంవత్సరాలు హిట్ లేదా ఫ్లాప్ తో సంబంధం లేకుండా నేను నా హృదయాన్ని అనుసరించాను. ఇది చాలా ప్రయాణం. అందరికీ ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’. అంటూ రాసుకొచ్చింది. అలాగే ఈ నటి అవార్డు అందుకున్న ఫొటోలు పంచుకుంది.

Next Story