- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడుము అందాలు చూపిస్తూ రెడ్ మిర్చీలా ఘాటెక్కిస్తోన్న మల్టీటాలెంటెడ్ నటి
అనన్య నాగళ్ల పొట్టేల్ అండ్ తంత్ర సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అనన్య నాగళ్ల పొట్టేల్ అండ్ తంత్ర సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. గత ఏడాది విడుదలైన పొట్టేల్ చిత్రంలో ఈమె బుజ్జమ్మ అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్భుత నటిగా పేరు గాంచింది. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక తంత్రలో ధనుష్ రఘుముద్రి, సలోని అశ్వనిలతో కలిసి నటించి జనాల్ని మెప్పించింది.
ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా.. మరిన్ని పాత్రల్లో కూడా అవకాశాలు దక్కించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది.
ఇక అనన్య నాగళ్ల మల్లేశం చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ప్లే బ్యాక్ అనే చిత్రంతో భారీ విజయం అందుకుంది. అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అవకాశం కొట్టేసి.. ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. వీటితో పాటుగా ఈ బ్యూటీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బహిష్కరణ అనే వెబ్ సిరీస్లో కూడా నటించి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈమె బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ నటి తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. రెడ్ కలర్ లెహంగా ధరించి.. కనిపించి కనిపించని ఎద అందాలు.. నడుము అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కించే ఫొటోలు పంచుకుంది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.






