- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Takshakudu: వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు.. టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
ఓటీటీ ట్రెండ్‌ను ఫాలో అవుతూ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు.

దిశ, సినిమా: ఓటీటీ ట్రెండ్‌ను ఫాలో అవుతూ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఫిలిమ్ ‘తక్షకుడు’. ‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు’ అనే క్యాచీవ్ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ మంచి బజ్ క్రియేట్ చెయ్యగా.. తాజాగా టీజర్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆనంద్ దేవరకొండ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ త్వరలో టీజర్ బ్లాస్ట్ కాబోతుందని తెలిపారు. ఈ చిత్రంలో ఆనంద్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, కొత్త లుక్‌లో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో నితాన్షి గోయెల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై త్వరలోనే అప్డేట్ రానుంది. కాగా.. ఇప్పటికే నితాన్షి లాపతా లేడీస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయింది.






