'అనగనగా ఒక రాజు' బ్లాస్టిక్ ప్రోమో వ‌చ్చేసింది..ఏకంగా దీపావ‌ళి బాంబుల‌తోనే

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 16:00:58  IST  )

'అనగనగా ఒక రాజు' లో నవీన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.దీపావళి కానుకగా స్పెషల్ ప్రోమో

అనగనగా ఒక రాజు బ్లాస్టిక్ ప్రోమో వ‌చ్చేసింది..ఏకంగా దీపావ‌ళి బాంబుల‌తోనే
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతి రత్నాలు సినిమాతో పాపులర్ అయిన నవీన్ పోలిశెట్టి... చేసే ప్రతి సినిమాలో కామెడీ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి నవీన్ పోలిశెట్టి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే 'అనగనగా ఒక రాజు'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాకు నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక 'అనగనగా ఒక రాజు' సినిమాలో నవీన్ హీరోగా చేస్తున్న నేపథ్యంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా అంటే 2026 జనవరి 14వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే... ప్రకటించారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే దీపావళి కానుకగా స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో టపాకాయలు అమ్ముకుంటూ హీరో నవీన్ పోలిశెట్టి కనిపించారు. ఈ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు టపాకాయలతో నవీన్ పొలిశెట్టి మెరిసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎలాన్‌ మస్క్, ప్రధాని నరేంద్ర మోడీని కూడా బాగా వాడేసుకున్నాడు. దీంతో ఈ ప్రమోషనల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

Next Story