ట్రెండ్‌కు అనుగుణంగా రెమ్యునరేషన్!.. ఫుల్ జోష్ మీదున్న నవీన్ పొలిశెట్టి

by Chukka Sudharani |

యంగ్ నటుడు నవీన్ పొలిశెట్టి తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండ్‌కు అనుగుణంగా రెమ్యునరేషన్!.. ఫుల్ జోష్ మీదున్న నవీన్ పొలిశెట్టి
X

దిశ, సినిమా: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో ఇండస్ట్రీకి పరిచయమైన నవీన్.. తొలి ప్రయత్నంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమాతో కామెడీ, టైమింగ్ కింగ్ అనిపించుకున్న ఈ హీరో.. ప్రస్తుతం తన కెరీర్‌లో జోరు పెంచాడు. ఇక ఈ ఏడాది ‘అనగనగా ఒక రాజు’తో వచ్చి హిట్ అందుకున్న ఈ హీరో.. రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. నవీన్ పొలిశెట్టి తన నెక్ట్స్ మూవీ కోసం మైత్రి మూవీ మేకర్స్‌తో చేతులు కలుపగా.. అది ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లోకి ప్రవేశించింది. అయితే.. పరిశ్రమలో కొనసాగుతున్న హై వాల్యూ ట్రెండ్‌కు అనుగుణంగా.. రెమ్యునరేషన్‌తో పాటు సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో కూడా నవీన్ వాటా అడుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి మైత్రీ ఒప్పుకున్నట్లు తెలుస్తుండగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిందని తెలుస్తుండగా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రావాల్సి ఉంది.

Next Story