- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకులకు కథ చెప్పి తండ్రితో సినిమా.. యంగ్ డైరెక్టర్ వశిష్ట కొత్త ట్రెండ్
చిరంజీవి ‘విశ్వంభర’ అనంతరం బాలయ్య బాబుతో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడట యంగ్ డైరెక్టర్ వశిష్ట.

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వశిష్ట మొదట నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే నటుడుగా విఫలమైన వశిష్ట.. డైరెక్టర్‌గా మాత్రం మొదటి చిత్రం ‘బింబిసార’తోనే బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక హిట్ కొట్టాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. రిలీజ్‌పై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి చిత్రం తర్వాత ఈ డైరెక్టర్ నటసింహం బాలయ్యతో ఓ ప్రాజెక్టు లైన్‌లో పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
అయితే.. నిజానికి ఈ డైరెక్టర్ ఫస్ట్ మోక్షజ్ఞ కోసం కథ రాసుకుని.. ఆ కథను వినిపించేదుకు వెళ్లారట. ఆ ప్రోసెస్‌లో బాలయ్యకు కూడా ఓ కథ చెప్పారని తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోక్షజ్ఞ కథ పక్కన పెట్టి, బాలయ్య ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లబోతున్నాడట మన డైరెక్టర్. ఇక ‘విశ్వంభర’లోనే ఇదే జరిగింది. మొదట రామ్ చరణ్ కోసం ఆయన కథ రాసుకుని.. చరణ్‌కి వినిపిస్తే ఆయన కూడా ఓకే చేశారట. కానీ ఆ ప్రయాణంలో చిరుకి ఓ కథ చెప్పడం.. విశ్వంభర టేకాఫ్ అవ్వడం జరిగాయి. దీంతో ఇదేం ట్రెండ్ వశిష్ట.. కొడుకులకు కథ చెప్పడానికి వెళ్లి తండ్రులను లైన్‌లో పెట్టావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు పలువురు.






