సంజయ్ దత్‌పై అమీషా పటేల్ కామెంట్స్.. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు..?

by Kodari Anjali |

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ అతని భార్య మాన్యత ద‌త్‌తో తనకున్న బాండింగ్ గురించి అమీషా పటేల్ చెప్పుకొచ్చింది.

సంజయ్ దత్‌పై అమీషా పటేల్ కామెంట్స్.. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ అతని భార్య మాన్యత ద‌త్‌తో తనకున్న బాండింగ్ గురించి అమీషా పటేల్ చెప్పుకొచ్చింది. “ మాన్యత కవలలతో గర్భవతిగా ఉన్నప్పుడు నేను సంజుకు బేబీ షవర్ ఇచ్చాను. పుట్టబోయేది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అని మాకు తెలియదు. పిల్లలు జన్మించాక చాలా హ్యాపీగా అనిపించింది. దత్‌ షహరాన్, ఇక్ర జన్మించినప్పుడు పుట్టినప్పుడు అందరికీ ఆసక్తికరమైన బహుమతుల్ని ఇచ్చారని.. మా ఇంటికి కూడా ప్రత్యేకంగా పంపించారని అమీషా వెల్లడించింది. ఆ బహుమతి గీత అండ్ ఖురాన్ కాపీ అని నటి చెప్పుకొచ్చింది.

ఆసక్తికర విషయమేంటంటే..? సంజయ్ తల్లిదండ్రులు కూడా మతాంతర వివాహం చేసుకున్నారని అమీషా చెప్పుకొచ్చింది. అతని తల్లి నర్గీస్ ముస్లిం, అతని తండ్రి సునీల్ దత్ హిందూ. ఇటీవల, విక్కీ లాల్వానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సంజయ్ సోదరి ప్రియా దత్, నర్గీస్ చనిపోయే ముందు ముస్లిం ఆచారాల ప్రకారం ఖననం చేయాలని తన కోరికను వ్యక్తం చేశారని వెల్లడించారు. తన తండ్రి సునీల్ దత్ తనకు వేరే విధంగా చెప్పినప్పటికీ, తన కోరిక మేరకు అలా చేశారని ఆమె చెప్పింది. ప్రస్తుతం అమీషా పటేల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story