సమంతకు బిగ్ షాక్ ఇచ్చిన అమెజాన్.. ఆందోళనలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది.

సమంతకు బిగ్ షాక్ ఇచ్చిన అమెజాన్.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నెటిజన్‌లకు హెల్త్ టిప్స్ ఇస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఈ బ్యూటీ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా.. వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత జంటగా నటించి మెప్పించారు. ఇందులో సమంత అండ్ వరుణ్ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టడంతో పాటు రొమాంటిక్ సీన్స్‌తో యూత్‌ను మెస్మరైజ్ చేశారు.

అయితే.. ఈ సిరీస్‌కు పార్ట్-2 ఉందని అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఊహించని విధంగా ఇప్పుడు ఈ సిరీస్ రద్దు అయింది. ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు అదే సంస్థ ఈ సిరీస్‌కు సంబంధించిన సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కేవలం ఇండియన్ వెర్షన్‌ను మాత్రమే కాకుండా ఇటాలియన్ వెర్షన్ సిటడెల్- డయానా సెకండ్ సీజన్ కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో సమంతకు బిగ్ షాక్ తగిలిందని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే.. సమంత రీ ఎంట్రీ తర్వాత విడుదలైన ఈ సిరీస్ ఊహించిన రేంజ్‌లో హిట్ కానప్పటికీ.. సమంత యాక్టింగ్‌కు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Next Story