- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ పాత్రకైనా ఈ హీరోలు రెడీ..చీర కట్టడం నుంచి అక్కడి వరకు!
పుష్ప 2 లో చీర కట్టి అల్లు అర్జున్ అందర్నీ అలరించాడని, ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాలో జోకర్ పాత్రలో కనిపించి ప్రభాస్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న ప్రభాస్, అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా కోసం ఎలాంటి పాత్రలైన చేసేందుకు ఈ ఇద్దరు హీరోలు ఎప్పుడూ ముందు ఉంటారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పుష్ప 2 సినిమాలో చీర కట్టి అల్లు అర్జున్ అందర్నీ అలరించాడని, ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాలో జోకర్ పాత్రలో కనిపించి ప్రభాస్ అందరినీ ఆకట్టుకుంటున్నాడని అంటున్నారు. పుష్ప 2 మూవీ తరహాలోనే ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ కు మంచి పేరు వస్తుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ హీరోలు అయినప్పటికీ, ఎలాంటి పాత్ర అయినా వేసేందుకు అల్లు అర్జున్, ప్రభాస్ ముందు ఉంటారని సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతే కాదు చీర కట్టులో అల్లు అర్జున్, జోకర్ గా ఉన్న ప్రభాస్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి, మా హీరోలు తోపు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది హీరోలు, ప్రెస్టేజ్ అంటూ చిన్న పాత్రలు చేయడం లేదని చురకలు అంటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వo వహిస్తున్నారు. ఇక అటు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1000 కోట్లతో తీస్తున్నారట.






