Allu Arjun :" పుష్ప 2 " సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం ఆయనదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్

by Phanindra |   (  Updated:2025-02-09 02:50:03  IST  )

ఈ సినిమా సక్సెస్.. నా ఆర్మీ అభిమానులకు అంకితం చేస్తున్నా

Allu Arjun : పుష్ప 2  సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం ఆయనదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన 'పుష్ప2' ( Pushpa 2 ) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్ల‌కు పైగా కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. అత్యధిక కలెక్షన్ల లిస్టు లో "దంగల్ " తర్వాత 'పుష్ప 2' రెండో స్థానంలో ఉంది. అయితే, రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం ఎన్నో వివాదాలకు దారితీసింది. ఈ సంఘటనలో అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి బన్నీ మీడియా ముందుకు రాలేదు. అంతే కాదు, ఎలాంటి సక్సెస్ పార్టీని కూడా నిర్వహించలేదు.

ఈ నేపథ్యంలో శనివారం థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ " మైత్రి మూవీస్ లాంటి నిర్మాతలు లేకపోతే పుష్ప లాంటి మంచి వచ్చేది కాదు. నటీ నటులకు మంచి పేరు తెచ్చేది ఒక్క డైరెక్టర్ మాత్రమే.. ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్ కే ఇవ్వాలి. సినిమా ఎంత గొప్పగా రావాలన్నా అది డైరెక్టర్ వల్లే సాధ్యమవుతుంది. నేను సుకుమార్ ( Sukumar ) కి పెద్ద ఫ్యాన్ ని, ఐదేళ్లు సుకుమార్ ఏది చెబితే అది పిచ్చోళ్లలా చేశాము. కరోనా సమయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అసలు, ఈ చిత్రం ముందుకు వెళ్తుందా? జాతర షూట్ చేయగలనా ? అని చాలాసార్లు అనిపించేది. ఈ సినిమా సక్సెస్.. నా ఆర్మీ అభిమానులకు అంకితం చేస్తున్నా అని చెప్పారు. కోవిడ్ సమయంలో జనాలు ఒక చోట ఉండకూడదన్నారు. మా యూనిట్ మొత్తం 500 మంది. ఆ సమయంలో ఇంతమందితో కలిసి ఎలా పని చేస్తామనిపించింది. ఇలా 2020 నుంచి చాలాఎన్నో కష్టాలు పడ్డాం. జాతర ఎపిసోడ్ లో నేను ఫ్లోర్ మీద పడుకుని చేయాలి. ఇది, ఇప్పుడు కంప్లీట్ చేయగలనా.. లేదంటే ఇక్కడే ఆగిపోతుందా అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి" అంటూ అల్లు అర్జున్ అన్నారు.

Next Story