- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లరోడి కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. మత్తెక్కిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
టాలీవుడ్ క్రేజీ హీరో అల్లరి నరేష్(Allari Naresh) సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరో అల్లరి నరేష్(Allari Naresh) సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన మెహర్ తేజ్(Meher Tej) దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇక అది అల్లరి నరేష్ కెరీర్‌లో 63వ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) భారీగా నిర్మిస్తున్నారు.
అయితే నేడు అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా అతనికి విష్ చేస్తూ.. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మూవీ టీమ్. ఇందులో భాగంగా ఈ చిత్రానికి ‘ఆల్కహాల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఒక పోస్టర్‌లో అల్లరి నరేష్ చాలా కామ్‌గా ఆల్కహాల్‌లో మునిగిపోయి ఉన్నాడు. ఇక ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Link






