‘కనకదుర్గ’గా రాబోతున్న అల్లరి నరేష్.. ప్రాజెక్ట్‌కు దర్శక–నిర్మాతలు ఫిక్స్

by Pulgam srinivas |

‘కనకదుర్గ’గా అల్లరి నరేష్ కొత్త ప్రయోగం.. డివోషనల్ టచ్‌తో నెక్స్ట్ మూవీ.

‘కనకదుర్గ’గా రాబోతున్న అల్లరి నరేష్.. ప్రాజెక్ట్‌కు దర్శక–నిర్మాతలు ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈయన, ఈ మధ్యకాలంలో మాత్రం వైవిధ్యమైన కథాంశాలతో కూడిన సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత, అదే స్థాయి విజయాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన వైవిధ్యమైన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఇటీవల ఈ నటుడు 12A రైల్వే కాలనీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం అల్లరి నరేష్ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే ‘ఆల్కహాల్’ అనే సినిమాలో నటిస్తున్న నరేష్, తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో, రచయిత–నిర్మాత బి.వి.ఎస్ రవి నిర్మాణంలో ఈ కొత్త చిత్రం రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డివోషనల్ టచ్‌తో రూపొందబోతుందని సమాచారం. ఈ నేపథ్యంలో చిత్రానికి ‘కనకదుర్గ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమానికి సురేఖ కొణిదెల, స్వప్న దత్, విద్య కొప్పినీడి, జాహ్నవి నారంగ్, సుప్రియ యార్లగడ్డ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం.

Next Story