Dhanush: ధనుష్ హీరోగా ఇళయరాజా బయో పిక్‌కు ఆల్ సెట్.. డైరెక్టర్ ఎవరంటే?

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రజెంట్ హీరోగా, డైరెక్టర్‌గా రాణిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తు్న్నారు.

Dhanush: ధనుష్ హీరోగా ఇళయరాజా బయో పిక్‌కు ఆల్ సెట్.. డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రజెంట్ హీరోగా, డైరెక్టర్‌గా రాణిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తు్న్నారు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈయన.. త్వరలో ‘కుబేర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. శేఖర్ కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భారీ అంచనాల మధ్య ‘కుబేర’ మూవీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా అనంతరం ధనుష్ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) బయో పిక్‌లో నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా.. ఈ బయోపిక్‌కు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక ధనుష్ హీరోగా ఇళయరాజా బయో పిక్‌ను సర్వం సిద్ధం అయినట్లు తెలుస్తుంది. అయితే.. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించడం లేదని.. అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వం వహిస్తున్నట్లు ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇళయరాజా బయోపిక్‌కు హీరో ధనుష్, డైరెక్టర్ మాథేశ్వరన్ కాంబో దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అలాగే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Next Story