అలా చేయకపోతే నాకు నిద్ర పట్టదు.. బాలీవుడ్ బ్యూటీ

by Ajay Maddhiboyina |

alia bhatt
X

దిశ, సినిమా : బీటౌన్ బబ్లీ గర్ల్ ఆలియా భట్ 'గంగూబాయి కథియావాడి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంజల్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవనుండగా.. ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆలియా.. తన కెరీర్‌తో పాటు లైఫ్‌స్టైల్, అభిరుచుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'కొత్తగా పరిచయమైన వ్యక్తుల కళ్లను చూసే వాళ్ల క్యారెక్టర్‌ కనిపెట్టేస్తా. నిజాయితీపరులనే ఎక్కువగా ఇష్టపడతా. ముఖ్యంగా మగాళ్లను చూసిన వెంటనే ఎలాంటివారో చెప్పగలగడం నా బలం. ఇలాంటి విషయాల్లో ధైర్యంగానే ఉన్నా.. రాత్రిపూట ఒంటరిగా ఉండాలంటే మాత్రం భయం' అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఇతరుల దగ్గరి పెర్‌ఫ్యూమ్‌ స్మెల్ చూసి, అదేంటో తెలుసుకునే వరకు వదలక పోవడం తన బలహీనతగా చెప్పిన ఆలియా.. హ్యాండ్‌బ్యాగ్‌లో తప్పనిసరిగా నాలుగైదు పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు మెయింటైన్ చేస్తానంటోంది. ఇక రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా డైరీ రాస్తానని, ఆ రోజు ముఖ్యమైన విషయాలన్నీ నోట్‌ చేయకపోతే నిద్ర పట్టదని చెప్పింది. చివరగా పెళ్లిపై స్పందిస్తూ.. ఏం జరిగినా మన మంచికే కదా! అంటూ ముగించింది.

https://www.instagram.com/p/CTMOHraM80-/?utm_source=ig_web_copy_link

Next Story