Alia Bhatt: షాకింగ్ నిర్ణయం తీసుకున్న అలియా భట్.. అసలు కారణం ఇదే!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) ‘సంఘర్ష్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీతో స్టార్ హీరోయిన్‌గా మారింది.

Alia Bhatt: షాకింగ్ నిర్ణయం తీసుకున్న అలియా భట్.. అసలు కారణం ఇదే!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) ‘సంఘర్ష్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీతో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె ‘ఆర్ఆర్ఆర్’లో నటించి తన అందం, అభినయంతో మెప్పించింది. ‘బ్రహ్మస్త్ర’ మూవీలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) సరసన నటించగా.. 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ఆమెకు రాహా అనే పేరు కూడా పెట్టారు.

ఇక తల్లి అయిన తర్వాత అలియా భట్ కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ‘జిగ్రా’(Jigra) తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు అల్ఫా, మధుబాల, లవ్ అండ్ వార్, ఇషాల్లా వంటి చిత్రాల్లో నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే తన భర్త, కూతురితో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అలియా భట్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కూతురికి సంబంధించిన ఫొటోలన్నీ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. రాహా ముఖం కనిపించే పిక్స్ తొలగించి.. కనిపించకుండా ఉన్నవి మాత్రం ఉంచేసింది.

దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నో ఫొటో పాలసీని అమలు చేస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే అలియా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అలా రాహాపై కూడా జరగకూడదని అలియా ఇలా చేసినట్లు టాక్. సైఫ్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరమడి పిల్లలపై కూడా దాడి చేస్తుండగా.. వారిని కాపాడే క్రమంలోనే ఆయనకు తీవ్రంగా గాయం అయింది. ఆ వ్యక్తి సైఫ్‌ను ఏకంగా ఆరుసార్లు పొడిచినట్లు అప్పట్లో ఎన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సైఫ్ పై దాడి తర్వాత, ఆలియా కూడా రాహా ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుంచి తొలగించిందని చర్చ జరుగుతోంది.

Next Story