- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alia Bhatt: ‘ఎల్లప్పుడూ ఇంట్లోనే సంతోషం3’ అంటూ క్యూట్ ఫొటో పంచుకున్న అలియా భట్
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor)అండ్ అలియా భట్ (Alia Bhatt) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor)అండ్ అలియా భట్ (Alia Bhatt) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట 14 ఏప్రిల్ 2022న ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి నవంబరు 6 2022 న రాహా అనే క్యూట్ పాప జన్మించింది. చాలా డేస్ అలియా, రణబీర్ కుమార్తె రాహా ఫేస్ ను చూపించలేదు. బయట ఎక్కడ కనిపించినా.. కూతురు ఫేస్‌ను కవర్ చేసేది. చాలా డేస్ తర్వాత చిన్నారి రాహా ముఖాన్ని రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ బుజ్జాయికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి.
పలు ఇంటర్వ్యూల్లో కూడా రణబీర్, అలియా పాప గురించి మాట్లాడుతుంటారు. ఇకపోతే భర్యాభర్తలిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర అనే చిత్రంలో కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక అలియా అటు ఫ్యామిలీని చూసుకుంటూ.. ఇటు సినిమాల్లో నటిస్తూ మరోవైపు సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ భర్త రణబీర్‌తో కలిసి ఓ ఫొటో పంచుకుంది. ఈ పిక్ కు ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ఎల్లప్పుడూ ఇంట్లోనే సంతోషం’ అని 3 అనే నెంబర్ జోడించింది. ప్రస్తుతం అలియా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






