అలియా భట్ కుమార్తె లిటిల్ రాహా క్యూట్ వాయిస్ వైరల్.. ఆకట్టుకుంటోన్న వీడియో

by Kodari Anjali |   (  Updated:2025-05-25 04:06:42  IST  )

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ అండ్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

అలియా భట్ కుమార్తె లిటిల్ రాహా క్యూట్ వాయిస్ వైరల్.. ఆకట్టుకుంటోన్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ అండ్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ దంపతులిద్దరు కలిసి బ్రహ్మాస్త్ర అనే చిత్రంలో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్ల పాటు వీరిద్దరు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 14 ఏప్రిల్ 2022 న ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు చిహ్నంగా రాహా అనే క్యూట్ పాప జన్మించింది. అయితే మొదట్లో రణబీర్ ఫ్యామిలీ బయట ఎక్కడ కనిపించినా కూమార్తె ఫేస్‌ను కవర్ చేసేది. చాలా డేస్ తర్వాత చిన్నారి రాహా ముఖాన్ని రివీల్ చేశారు.

కొన్ని డేస్ నుంచి ఈ బుజ్జాయికి సంబంధించి పలు ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. పలు ఇంటర్వ్యూలో కూడా రణబీర్ అండ్ అలియాకు పాప గురించి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ప్రజెంట్ వీరిద్దరు అటు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఇటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇకపోతే చాలా డేస్ నుంచి ఎయిర్ పోర్ట్‌లో రాహా నెటిజన్లకు హాయ్, బాయ్ చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. కానీ ఇందులో రాహా వాయిస్ మాత్రం ఇన్నిడేస్ వినిపించలేదు. ప్రస్తుతం రాహా అభిమానులకు బాయ్ అని క్యూట్‌గా చెప్పిన వాయిస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story