- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా చూసి ఆరేళ్ల పాటు నా కొడుకు భయంతోనే ఉన్నాడు.. అక్షయ్ కుమార్ కామెంట్స్ వైరల్
‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్‌లో జోరు పెంచాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.

దిశ, సినిమా: ‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్‌లో జోరు పెంచాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలోనే ప్రమోషన్స్‌లో పాల్గోన్న అక్షయ్ కుమార్.. భూల్ భులయ్య సినిమా చూసి తన కొడుకు ఆవర్ ఫేస్ చేసిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ‘2007లో విడుదలైన భూల్ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్‌ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. విద్యాబాలన్‌లో ఆమె భూల్ భులయ్యలో పోషించిన పాత్ర మంజులికను మాత్రమే చూసేవాడు. అందుకే ఆమె వస్తుంది అంటేనే భయంతో పారిపోయేవాడు. అప్పుడు నేనే వాడికి నెమ్మదిక నచ్చజెప్పి.. విద్యాబాలన్ చాలా మంచిదని చెప్పేవాడిని. అయినా ఆ సినిమాలో నుంచి వాడు రావడానికి ఆరేళ్లు పట్టింది’ అని చెప్పుకొచ్చాడు.






