Akshay Kumar & Saif Ali Khan: 17 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న బ్లాక్ బస్టర్ జోడి..

by Kodari Anjali |

1994లో వచ్చిన ఒక భారతీయ యాక్షన్ కామెడీ సినిమా మెయిన్ ఖిలాడి తు అనారి (Main Khiladi Tu Anari).

Akshay Kumar & Saif Ali Khan: 17 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న బ్లాక్ బస్టర్ జోడి..
X

దిశ, వెబ్‌డెస్క్: 1994లో వచ్చిన ఒక భారతీయ యాక్షన్ కామెడీ సినిమా మెయిన్ ఖిలాడి తు అనారి (Main Khiladi Tu Anari). ఈ సినిమాను సమీర్ మల్కాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, శిల్పా శెట్టి, రాగేశ్వరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. సైఫ్ అలీ ఖాన్ అండ్ అక్షయ్ కుమార్ ఇద్దరికీ బాలీవుడ్లో ఒక స్టార్‌గా పేరు తెచ్చిందని చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా ఈ సినిమాలోని ‘‘మెయిన్ ఖిలాడి తు అనారి’’ పాట చాలా పాపులర్ అయింది. అలాగే ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన పాటలలో ఈ సాంగ్ ఒకటి. అయితే తాజాగా అక్షయ్ కుమార్ అండ్ సైఫ్ అలీ ఖాన్ అభిమానులు ఎగిరిగంతులేసే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బ్లాక్ బస్టర్ కాంబో మళ్లీ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

17 సంవత్సరాల తర్వాత అక్షయ్ కుమార్ & సైఫ్ అలీ ఖాన్ కలిసి తెర పంచుకోబోతున్నారని సమాచారం. ఇది వారి అభిమానులకు ఒక గొప్ప వార్త. వారు ఒక మాస్ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నారని నెట్టింట టాక్ వినిపిస్తుంది. మరోసారి వీరిద్దరితో సినిమా వస్తే.. పెద్ద స్థాయిలో విజయం సాధించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కావచ్చు.

Next Story