- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని కోడలు శోభిత లేటెస్ట్ ఫొటోలు.. వారసుడొస్తున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్
అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్(Bollywood0లో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya).. సమంత(Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత అతనితో ప్రేమలో పడింది. అంతేకాకుండా చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని వేకెషన్స్, హోటల్స్‌కి కూడా వెళ్ళింది.
అయితే ఆ ఫొటోస్ కాస్తా నెట్టింట బయటపడటంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ వీరిద్దరూ ఆ విషయం పై స్పందించలేదు. కానీ డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్‌గా మ్యారేజ్(Marriage) చేసుకుని భార్యా భర్తలు అయ్యారు. ఇక అప్పటినుంచి అక్కినేని కోడలు స్టేటస్‌తో పాటు భర్తతో ఎంజాయ్ చేస్తుంది శోభిత. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన కొన్ని స్టైలీష్ ఫొటోస్‌ను షేర్ చేసింది. జారా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ.. ‘ఈ పండుగ సీజన్‌లో నిర్మాణం మరియు మృదుత్వం మధ్య @zara.. www.zara.com లో తాజా పండుగ సేకరణను కనుగొనండి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అక్కినేని వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా శోభిత తల్లికాబోతుందనే విషయం నెట్టింట షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నెటిజన్లు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు.






