- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sobhitha Dhulipala: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని కోడలు శోభిత.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు
యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ(Sobhitha Dhulipala) పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ(Sobhitha Dhulipala) పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే కొద్ది కాలం పాటు నాగచైతన్య(Naga Chaitanya)తో డేటింగ్ చేసింది. ఇక గత ఏడాది డిసెంబర్‌లో పెద్దల సమక్షంలో చైతు, శోభిత గ్రాండ్‌గా అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు కొద్ది రోజులు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. పెళ్లైన కానుంచి శోభిత సోషల్ మీడియాకు కూడా దూరం అయింది. బయట కూడా ఎక్కడా కనిపించలేదు. మరీ ముఖ్యంగా సినిమా వేడుకల్లో అసలే కనిపించలేదు.
ఇక రెండు నెలల తర్వాత మొదటి సారి నాగచైతన్య నటించిన ‘తండేల్’ (Thandel)ఈవెంట్‌లో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి తర్వాత పబ్లిక్ వేడుకకు హాజరవ్వడం అది మొదటిసారి కావడంతో అంతా ఆమె ఫొటోలను షేర్ చేశారు. ఈ వేడుకల్లో సంప్రదాయ చీరకట్టులో కనిపించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అయితే వివాహం తర్వాత ఇంటికే పరిమితం అయిన శోభిత.. ఇక సినిమాలకు దూరం కానున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు బోల్డ్‌గా నటించిన ఆమె అక్కినేని ఫ్యామిలీ కండీషన్ పెట్టడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉండబోతుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
దీంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఇక శోభిత మాత్రం వాటికి రియాక్ట్ అవకుండా.. తన భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శోభిత అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఓ షూటింగ్ సెట్‌లో ప్రత్యక్షమైంది. ఓ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో శోభిత అక్కడ కనిపించడం హైలైట్ అవుతుంది. బ్లాక్ కలర్ పంజాబీ డ్రెస్‌లో కనిపించింది. అయితే అది ఆమె నటిస్తున్న సినిమా షూటింగా.. లేక తనకు సంబంధం లేని షూట్‌లో ఉండా? అనేది కన్‌ఫ్యూజన్‌గా మారింది. ప్రస్తుతం శోభిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






