ఏ ముహూర్తాన వచ్చావో కానీ చైతన్య అన్న మొత్తం చేంజ్ అయిపోయాడంటూ శోభితపై అక్కినేని ఫ్యాన్స్ ప్రశంసలు.. కారణం ఇదే..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-27 11:31:37  IST  )

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఏ ముహూర్తాన వచ్చావో కానీ చైతన్య అన్న మొత్తం చేంజ్ అయిపోయాడంటూ శోభితపై అక్కినేని ఫ్యాన్స్ ప్రశంసలు.. కారణం ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ.. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya) సమంత(Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత అతనితో ప్రేమలో పడింది. అంతేకాకుండా చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని వేకెషన్స్, హోటల్స్‌కి కూడా వెళ్ళింది. అయితే ఆ ఫొటోస్ కాస్తా నెట్టింట బయటపడటంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.

కానీ వీరిద్దరూ ఆ విషయం పై స్పందించలేదు. కానీ డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్‌గా మ్యారేజ్(Marriage) చేసుకుని భార్యా భర్తలు అయ్యారు. ఇక అప్పటినుంచి అక్కినేని కోడలు స్టేటస్‌తో పాటు భర్తతో ఎంజాయ్ చేస్తుంది శోభిత. ఈ క్రమంలో అక్కినేని కోడలిపై నెట్టింట ప్రశంసల జల్లులు కురుస్తుంది.

మ్యారేజ్ అయిన కొత్తలో నాగచైతన్య, శోభిత తిరుపతి వెళ్లిన వీడియో షేర్ చేస్తూ.. ‘ఏ ముహూర్తాన వచ్చావో శోభిత వదిన చై అన్న మొత్తం చేంజ్ అయిపోయాడు.. మాస్ అవతార్, యాక్టీవ్ అవ్వడం, ఫ్యాన్స్‌కు కావాల్సిన మూవీస్ చేడయం.. ఇలా ఫైనల్లీ గత 15 సంవత్సరాల నుంచి చైతన్య అన్నను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నామో అలా చూస్తున్నాము నీతో పెళ్లి అయ్యాక’ అంటూ అక్కినేని కోడలిని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల‌గా మారింది.

Click For Tweet..

Next Story