సమంత "మా ఇంటి బంగారం"పై అఖిల్ కామెంట్స్ వైర‌ల్ !

by velandi.Saikiran |

సమంత లేటెస్ట్ గా నటించిన మా ఇంటి బంగారం మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అఖిల్.

సమంత మా ఇంటి బంగారంపై అఖిల్ కామెంట్స్ వైర‌ల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే లెనిన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్ కానున్న తరుణంలో, ప్రమోషన్స్ లో పాల్గొంటూ దూసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ సమంత లేటెస్ట్ గా నటించిన మా ఇంటి బంగారం మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అఖిల్. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తాను ఇంకా చూడలేదని వెల్లడించిన అఖిల్... ఆ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నారు. తాను ముందుగా ట్రైలర్ చూశానని.. అందులో సమంత యాక్టింగ్ సూపర్ గా ఉన్నట్లు పేర్కొన్నారు.

ట్రైలర్ చూడగానే సినిమా హిట్ కొట్టడం గ్యారెంటీ అని తాను అనుకున్నట్లు గుర్తు చేశారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి సమంత, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అఖిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ జూలై 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ నటిస్తున్నారు. వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాయలసీమ పల్లెటూరి నేప‌థ్యంలో ఈ సినిమా రానుంది.

Next Story