- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhanda 2 : రిలీజైన 24 గంటల్లో అఖండ 2 టీజర్ రికార్డు
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2: తాండవం’ సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. జూన్ 9 సాయంత్రం 6:03 గంటలకు విడుదలైన ఈ టీజర్, 24 గంటల్లో..

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2: తాండవం’ సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. జూన్ 9 సాయంత్రం 6:03 గంటలకు విడుదలైన ఈ టీజర్, 24 గంటల్లో ఇరవై మూడున్నర మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, తెలుగు సినిమా టీజర్లలో ఆల్-టైమ్ టాప్ 5లో చోటు సంపాదించింది.
ఈ టీజర్‌కు 5.90 లక్షలకు పైగా లైక్‌లు రాగా, సీనియర్ హీరోల సినిమా టీజర్లలో ఇది ఆల్-టైమ్ రికార్డుగా నిలిచింది. యూట్యూబ్‌లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూ, అభిమానులు, సినీ ప్రియులలో భారీ సంచలనం రేపింది.
బాలకృష్ణ జన్మదిన సందర్భంగా విడుదలైన ఈ టీజర్, ‘అఖండ’ మొదటి భాగం సృష్టించిన హవాను మరింత పెంచింది. బాలకృష్ణ (Balakrishna) అఘోరా పాత్ర, బోయపాటి శ్రీను (Boyapati Sreenu) యాక్షన్ సన్నివేశాలు, థమన్ (SS Thaman) నేపథ్య సంగీతం, ఆది పినిశెట్టి (Adi Pinisetty) విలన్ పాత్రతో ఈ టీజర్ అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ‘‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?’’ అంటూ ఉగ్రరూపం దాల్చిన అఘోరాగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట (Ram Achanta), గోపీ ఆచంట (Gopi Achanta) నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా విడుదల కానుంది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ‘అఖండ 2’ టీజర్ సాధించిన ఈ రికార్డులు సినిమా విజయానికి బలమైన సూచనగా నిలుస్తున్నాయి.






