‘అఖండ 2’ మూవీ ఎఫెక్ట్.. థియేటర్ లో అఘోరాలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-14 06:00:12  IST  )

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘అఖండ 2’.

‘అఖండ 2’ మూవీ ఎఫెక్ట్.. థియేటర్ లో అఘోరాలు
X

దిశ,వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘అఖండ 2’. ఈ నెల 12వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఫ్యాన్స్, కామన్ అడియన్స్, పిల్లలు సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పోటెత్తారు. ఈ సినిమాలో సనాతన ధర్మం గొప్పతనం గురించి వివరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అఘోరా వేషధారణలో పలువురు థియేటర్‌కి వచ్చి ‘అఖండ 2’ సినిమాను చూసిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మూవీలోని పలు సన్నివేశాలు చూసి, తమ సీట్ల నుంచి లేచి మరీ సినిమాను అభినందించారు. యూపీలో వచ్చిన విభూతి కాషాయ యోగులు అఖండ తాండవం చూసి, సీట్ల నుంచి లేచి కరతాళ ధ్వనులతో సందడి చేశారు.వీడియో

Next Story