- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 ఫస్ట్ డే కలెక్షన్స్..ఎన్నికోట్లంటే?
బాలయ్య అఖండ 2 సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్సు ఉన్నట్లు టాక్. అయితే ఈ నేపథ్యంలోనే తొలిరో

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. డిసెంబర్ 11వ తేదీన రాత్రి ప్రీమియర్లు పడిపోయాయి. అఖండ 2 సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు చెబుతున్నారు. మాస్, యాక్షన్ తో పాటు హిందూ ధర్మం చుట్టూ ఈ కథ నడవడంతో ఈ సినిమా చూసి ఎందుకు ఇగబడుతున్నారట జనాలు.
దానికి తోడు పెద్ద సినిమాలు ప్రస్తుతం లేకపోవడంతో, బాలయ్య అఖండ 2 సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్సు ఉన్నట్లు టాక్. అయితే ఈ నేపథ్యంలోనే తొలిరోజు కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. కేవలం బుక్ మై షోలో గంటకు 20 వేల అఖండ 2 టికెట్లు బుక్ అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 65 నుంచి రూ.80 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయట.
ఈ లెక్కన మొదటి వారంలో అఖండ 2 సినిమా దాదాపు రూ. 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అటు 2021లో అఖండ సినిమా కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. కరోనా సమయంలో కూడా అఖండ మూవీ తొలిరోజు రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. మరి ఈ అఖండ 2 ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.






