- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ajay Devgn: దృశ్యం 3 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే 2’తో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే 2’తో బిజీగా ఉన్నాడు. 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘దే దే ప్యార్ దే’ కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో అజయ్ దేవ్‌గన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. టీ సిరీస్ పిలిమ్స్ అండ్ లవ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌లో వేగం పెంచిన టీమ్.. ఇందులో నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం అనంతరం అజయ్ దేవ్‌గన్ తన ఫోకస్ దృశ్యం 3పై పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు దృశ్యం 3 డిసెంబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుండగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి షూటింగ్ పూర్తవుతుందని, అక్టోబర్ 2కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల నుంచి టాక్. ఇక దీంతో పాటు గోల్మాల్5 కూడా స్టార్ట్ చేయనున్నాడట అజయ్ దేవ్‌గన్. ప్రజెంట్ ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వైరల్ అవుతుండగా.. బాలీవుడ్ సిని లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. లింక్






