- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోహన్ బాబు స్కూల్లో చదివింది.. టాప్ హీరోయిన్ అయింది
మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యాలయంలో ఐశ్వర్య రాజేష్ చదువుకున్నారు. ఈమె ప్రస్తుతం తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో మంచి జోష్‌లో కెరీర్లో ముందుకు సాగుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టాక చాలా సినిమాల్లో చిన్న, విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని ఎన్నో సినిమాల్లో నటించి, అనేక విజయాలను సొంతం చేసుకొని కలెక్షన్ కింగ్ మోహన్ బాబుగా పేరు సంపాదించుకున్నారు.
కొంతకాలం క్రితం మోహన్ బాబు తన కుమారుడు హీరోగా నటించిన కన్నప్పలో కీలకపాత్రలో నటించాడు. ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ లో నటిస్తున్నాడు. నటుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈయన తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ అనే పేరుతో చాలా విద్యా సంస్థలను నెలకొల్పాడు. ఇందులో ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యాసంస్థల్లో పేద పిల్లలతో పాటు సెలబ్రిటీల పిల్లలు కూడా చదువుకున్నారు.
ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ... నేను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యాలయంలో చదువుకున్న ఓ అమ్మాయి ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి పేరు నాకు గుర్తుకు రావడం లేదు అని ఆయన అన్నారు. ఇంతకు మోహన్ బాబు ప్రస్తావించిన ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు, తమిళ్, తెలుగు రెండు ఇండస్ట్రీలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్. ఈ ముద్దుగుమ్మ మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదివింది. ప్రస్తుతం ఈమె అటు తమిళ్, ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీలలో మంచి అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ను ముందుకు సాగిస్తుంది.






