- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aishwarya Menon : అందం విషయంలో డోకా లేదు.. మరోసారి అలా రెచ్చిపోయింది
Aishwarya Menon: అందాలతో ఆకట్టుకుంటున్నా ఆ విషయంలో ఫెయిల్యూర్ అవుతున్న యంగ్ బ్యూటీ.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరాలంటే ముఖ్యంగా కావాల్సింది అందం, నటన. కానీ ఈ రెండు మాత్రమే ఉంటే వారు అద్భుతమైన స్థాయికి చేరుకోలేరు. ఈ రెండు ఉన్నవారికి మంచి విజయాలు కూడా దక్కాలి. అలా అందం, నటన ఉండి ఎవరికైతే మంచి విజయాలు తక్కుతాయో అలాంటి బ్యూటీలే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్తారు.
అందం ఉన్నా కూడా సరైన విజయాలు లేక వెనకబడిపోయిన ముద్దుగుమ్మలు కూడా చాలామంది తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. అలాంటి వారిలో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందిన స్పై అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది.
దానితో ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఐశ్వర్య మీనన్, కార్తికేయ హీరోగా రూపొందిన భజే వాయువేగం అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత ఈమెకు మంచి అవకాశాలు దక్కుతాయని చాలామంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఈ హీరోయిన్కి పెద్దగా క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు దక్కలేదు.
ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా అందులో తన అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రకారును ఊపేస్తోంది. ఇలా అందాలతో అలరిస్తున్న ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం పెద్ద స్థాయిలో దక్కడం లేదు.






