- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iswarya Menon : క్లాసీ లుక్‌తో మైండ్ బ్లోయింగ్ పోజ్
వైట్ కలర్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఐశ్వర్య మీనన్.

దిశ, వెబ్ డెస్క్: హాటెస్ట్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ ‘కాదలిల్ సోదప్పువదు ఎప్పడి’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఎమ్.ఎస్. రమేష్ దర్శకత్వం వహించిన ‘దశావళ’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి, ‘మాన్సూన్ మంగోస్’ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది.
ఇక 2023లో విడుదలైన ‘స్పై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఐశ్వర్య మీనన్‌కు మాత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఆ తర్వాత ఈమె కార్తికేయ సరసన ‘భజే వాయువేగం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించగా, ఇందులో ఐశ్వర్య తన నటనతో పాటు అందాలతో ప్రేక్షకులను అలరించింది.
అయితే ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసినప్పటికీ భారీ స్థాయి గుర్తింపును మాత్రం సంపాదించుకోలేకపోయింది. అలాగే వరుస అవకాశాలను కూడా పెద్దగా అందుకోలేకపోతుంది.
సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా అలరించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఐశ్వర్య మీనన్ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ బ్యూటీ తెలుపు రంగులో ఉన్న పొట్టి స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి సోఫాపై కూర్చొని స్టైలిష్ లుక్‌లో ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ఇందులో ఐశ్వర్య తలపై సిల్వర్ హెడ్‌చైన్ ఆభరణం ధరించి, చేతికి ఆకర్షణీయమైన జ్యువెలరీ వేసుకుంది.
అలాగే తన కురులను వదిలేసి వన్ సైడ్ చూస్తూ హాట్ అందాలను ఓలకబోసే విధంగా ఉన్న ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Photos Courtesy: Instagram






