- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రిస్మస్ మిస్ అయ్యింది.. కానీ పండుగకు రాబోతున్నాము అంటూ బిగ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్
అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘డెకాయిట్’. ‘ఒక ప్రేమ కథ’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ క్రిస్మస్ స్పెషల్‌గా రావాల్సి ఉండగా.. రిలీజ్ డేట్ వాయిదా పడింది.

దిశ, సినిమా: అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘డెకాయిట్’. ‘ఒక ప్రేమ కథ’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ క్రిస్మస్ స్పెషల్‌గా రావాల్సి ఉండగా.. రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ‘డెకాయిట్’ రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చాడు హీరో అడివి శేష్. రివేంజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. క్రిస్మస్‌కే రావాల్సిన డెకాయిట్ కొన్ని అనివార్య కారణాల చేత పోస్ట్ పోన్ కాగా.. ఆడియన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా రిలీజ్ అప్డేట్ ఇచ్చాడు హీరో. ఈ మేరకు.. ‘డెకాయిట్ క్రిస్మస్‌కు కొంచెం మిస్ అయ్యింది.. కానీ పండగకి ఫిక్స్ అయ్యిందీ.. ఏ పండగ? అన్నది రేపు చెబుతాను’ అంటూ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. సంక్రాంతికి వస్తావా అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






