Adithya Dhar: ధురంధర్ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో?

by Pulgam srinivas |

ఆదిత్య ధర్ 'ధురంధర్ 3' కంటే ముందు విక్కీ కౌశల్ హీరోగా అశ్వథ్థామ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తుంది.

Adithya Dhar: ధురంధర్ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సంచలనంగా మారిన దర్శకుల్లో ఆదిత్య ధర్ ఒకరు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ మొదటి భాగం వెయ్యి కోట్లకు మించిన వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం రెండవ భాగం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కలెక్షన్ల విషయంలో ఇండియన్ సినీ హిస్టరీలోనే కొత్త రికార్డును సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

'ధురంధర్ పార్ట్ 2'కి హిట్ టాక్ రావడంతో ఆదిత్య ధర్ తన తదుపరి మూవీ ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి జనాల్లో బాగా పెరిగింది. ఈ దర్శకుడు 'ధురంధర్ 3' చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ బాలీవుడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం బట్టి చూస్తే ఈ స్టార్ దర్శకుడు 'ధురంధర్ 3' కంటే ముందు విక్కీ కౌశల్ హీరోగా అశ్వథ్థామ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఆదిత్య ధర్ 'ఉరి' చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు.

ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈయన విక్కీ కౌశల్ హీరోగా అశ్వథ్థామ అనే ప్రాజెక్టును 2021లో స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవసరం కావడం, అలాగే అదే సమయంలో కరోనా పెద్ద ఎత్తున రావడంతో ఈ ప్రాజెక్టు సైడ్ అయింది. తాజాగా ఈ దర్శకుడు రూపొందించిన ధురంధర్ పెద్ద స్థాయి విజయం సాధించడంతో నిర్మాతలు ఇప్పుడు ఈ దర్శకుడితో అశ్వథ్థామ ప్రాజెక్టును భారీ బడ్జెట్ పెట్టి నిర్మించడానికి పోటీపడుతున్నట్లు, దానితో ఈయన కూడా అటువైపే కాస్త మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story